vijaya reddy joined in congress: తెరాస పాలనలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.... నగరవాసులు సమస్యలతో సతమతమవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నగర రూపురేఖలు మారుతాయని ఆయన వెల్లడించారు. దివంగత నేత పీజేఎస్ కుమార్తె, తెరాస కార్పొరేటర్ విజయారెడ్డి గాంధీభవన్‌లో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అంతకుముందు ఖైరతాబాద్ నుంచి తన అనుచరులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమెకు... పార్టీ నేతలు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.
tpcc revanth reddy comments: పీజేఆర్ ఆశయాల కోసం పార్టీలోకి... ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీసిన మహోన్నత నేత పీజేఆర్ అని.... ఆయన ఆశయాల కోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుందని రేవంత్ తెలిపారు. నగరంలో నేడు మహిళలకు, పేదలకు రక్షణ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బస్తీ ప్రజల పక్షాన పోరాడటం కోసం నాయకత్వం అవసరమని వెల్లడించారు. అందుకోసమే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారని స్పష్టం చేశారు. హైదరాబాద్ పేద ప్రజల పక్షాన పోరాడే నాయకురాలు మాకు దొరికిందని తెలిపారు. విజయారెడ్డికి కాంగ్రెస్‌లో మంచి గౌరవం దక్కుతుందని హామీనిచ్చారు.
''పీజేఆర్ పేరు తెలియని వారు ఉండరు. పేదలకు పెద్దన్న పీజేఆర్... నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్‌తో వెలిశాయి. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదు. చివరి శ్వాసవరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారు. పీజేఆర్ పోరాటం వల్లనే కృష్ణాలో వాటా దక్కింది. జంట నగరాలకు కృష్ణా వాటర్ కోసం ఆయన పోరాటం చేశారు. కొందరు తమ ఘనతగా ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. నగరంలో పేదొల్లకు ఇళ్లు, పట్టాలు ఇప్పించారు. పీజేఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బహిష్కరించినా ఆయన కాంగ్రెస్ జెండా వీడలేదు. పీజేఆర్ పెంచి పోషించిన వారే ఇప్పుడు నగరంలో ఎమ్మెల్యేలు అయ్యారు.'' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
komati reddy venkat reddy comments: కాంగ్రెస్ హయాంలోనే... వానాకాలం సీజన్ ప్రారంభమైనా.. ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం అందలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హైదరాబాద్ రూపురేఖలు మారాయన్న ఆయన... శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.