వృద్ధుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీసులు తమ వంతు కృషి చేస్తారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందుకోసం ఓ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వృద్ధులు తమకు ఎదురయ్యే సమస్యలను హెల్ప్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. మెరుగైన పోలీసింగ్ కోసం వృద్ధుల సూచనలు, సలహాలు తీసుకుంటామని వివరించారు. ఇందుకోసం రాయదుర్గం పోలీసులు చేపట్టిన పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు, శిరస్త్రాణాలను పోలీసులకు అందజేశారు.
వృద్ధుల సమస్యల కోసం పైలట్ ప్రాజెక్ట్ - rayadurgam police pilot project latest news
వృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందుకోసం రాయదుర్గం పోలీసులు చేపట్టిన పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.
వృద్ధుల సమస్యల కోసం పైలెట్ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన కానిస్టేబుళ్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. వృద్ధుల సమస్యలను తెలుసుకొని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఫలితంగా అధికారులు ఆయా సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు.
ఇదీ చూడండి: రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేశారు: ఆర్.కృష్ణయ్య