బ్యాంకు రుణాల మంజూరులో కౌలుదారులకు ఇబ్బందులు ఉన్నాయని... ఆంధ్రప్రదేశ్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకు అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. యజమాని హక్కులకు భంగం కలగకుండా కొత్త కౌలుదారు చట్టం తీసుకొస్తామన్నారు. యజమానులు కౌలురైతుల వివరాలు బహిరంగ పరచాలన్నారు. కౌలు రైతులకు రుణాలిచ్చే విధానాన్ని సరళీకరించాలన్నారు.
ప్రతి కౌలురైతుకు బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు: కన్నబాబు
ప్రతి కౌలురైతుకు బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. ఈనెల 20 నుంచి ఆగస్టు 7వరకు బ్యాంకు రుణ పక్షోత్సవాలు జరపుతామన్నారు. ప్రతి కౌలు రైతుకు సీసీఆర్‌సీ ధ్రువపత్రం ఇప్పిస్తామని చెప్పారు. కౌలు రైతులు, పాడిరైతులు, జాలర్లకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు ఈ ఏడాది రూ.8,500 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:గాంధీ భవన్కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత