కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరించేందుకు ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభగల శాస్త్రవేత్తలను ఎంపిక చేసి పరిశోధన బాధ్యతలను అప్పగించాలని పిటిషనర్ కోరారు.
వ్యాక్సిన్ ఆవిష్కరణకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని పిల్ - telangana government news
కరోనా టీకా ఆవిష్కరణకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. శాస్త్రవేత్తలను ఎంపిక చేసి పరిశోధన అప్పగించాలని పిటిషనర్ కోరారు. దీనిపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వ్యాక్సిన్ ఆవిష్కరణకు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని పిల్
వివిధ సంస్థలు, యూనివర్సిటీలు పరిశోధనలు చేస్తున్నా.. ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. న్యాయ విద్యార్థి మధుకర్ దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి:బీఆర్ఎస్‌పై ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వాలి : హైకోర్టు