కరోనా నియంత్రణకు హుడాసాయినగర్‌లో చేపట్టిన చర్యల గురించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక కాంటాక్ట్‌లను గుర్తించి వారిని పరీక్షల నిమిత్తం తరలించాలన్నారు. కరోనా సోకిన వారిలో చిన్నపిల్లలు ఉండటంతో వారితో ఆడుకున్న చిన్నారులను గుర్తించాలని సూచించారు.
కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో పటిష్ఠ చర్యలు
కరోనా కట్టడి చర్యలను పటిష్ఠంగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం హయత్‌నగర్ డివిజన్‌లోని హుడాసాయినగర్, వనస్థలిపురంలోని కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు.
Hyderabad corona latest news
16 మంది క్వారంటైన్ కేంద్రానికి...
వనస్థలిపురం డివిజన్ పరిధిలో శనివారం 16 మందిని పరీక్షల నిమిత్తం సరోజిని ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో జీవన్‌సాయి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎస్కేడీనగర్‌లో కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్న 10 మందిని గుర్తించారు. వీరిలో 8మందిని సరోజిని ఆసుపత్రికి తరలించగా.. మరో ఇద్దరు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోవడం వల్ల వదిలేశారు.