తెలంగాణ

telangana

ETV Bharat / state

శిశుసంక్షేమ కమిటీల ఏర్పాటుపై హైకోర్టులో వ్యాజ్యం - శిశుసంక్షేమ కమిటీ

కొత్త జిల్లాల్లో శిశు సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయడం లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

శిశుసంక్షేమ కమిటీ ఏర్పాటుపై హైకోర్టులో వ్యాజ్యం

By

Published : Sep 30, 2019, 8:15 PM IST

శిశుసంక్షేమ కమిటీ ఏర్పాటుపై హైకోర్టులో వ్యాజ్యం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో శిశు సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయడం లేదంటూ ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. చట్ట విరుద్ధంగా పాత కమిటీలనే విస్తరించి... కొనసాగిస్తున్నారని, జువైనల్ చట్టం ప్రకారం శిశువుల ప్రయోజనాలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం... నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details