కొవిడ్ చికిత్సల పేరిట ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని పట్నం అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి డి.జి. నరసింహారావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 50 శాతం బెడ్లను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకుని ఆన్‌లైన్లో పారదర్శకంగా కేటాయించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. కార్పొరేట్ ఆస్పత్రులు రోజుకు రూ. 50వేల నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఏ ఆస్పత్రి కూడా ప్రభుత్వం నిర్దేశించిన రూ. 4 వేల నుంచి 9 వేలను తీసుకోవడం లేదని వివరించారు.