సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానంపై భాజపా సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఈ తీర్మానం చట్టబద్ధంకాదని... దీనిని కొట్టి వేయాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
'ముస్లింల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు' - భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి మీడియా సమావేశం
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఈ పిల్ వేశారు.
Indra Sena Reddy
చట్టరూపంలో వచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ తీర్మానం చేసి... కేంద్ర ప్రభుత్వం కంటే తానే గొప్పని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎంఐఎంను సంతృప్తి పర్చేందుకు... ముస్లింల ఓట్ల కోసమే ముఖ్యమంత్రి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్