రోజు రోజుకు అంతరించిపోతున్న జీవరాశులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్ అన్నారు. గతంలో ఎన్నో జల, చరరాశులు భూమిపై ఉండేవని... అందులో ఇప్పుడు కొన్ని కనుమరుగైయ్యాని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వైల్డ్‌లైఫ్, ట్రావెల్ అండ్ నేచర్ ఫొటోగ్రఫీ ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. హానీకాంబ్ క్రియేటివ్ సహాకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాలైన జంతు, జలరాశులతో పాటు ఆయా రకాలైన భూమి, ప్రకృతి సొయగాలు ఆకట్టుకుంటున్నాయి.
వీక్షకులను ఆకట్టుకుంటోన్న ఫొటోగ్రఫీ ప్రదర్శన
హైదరాబాద్‌లో హానీకాంబ్ క్రియేటివ్ సహకారంతో ఏర్పాటు చేసిన వైల్డ్‌లైఫ్, ట్రావెల్ అండ్ నేచర్ ఫొటోగ్రఫీ ప్రదర్శనను ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ ఫొటోగ్రాఫర్లు తీసిన 100కు పైగా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
వీక్షకులను ఆకట్టుకుంటోన్న ఫొటోగ్రఫీ ప్రదర్శన
ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువ ఫొటోగ్రాఫర్లు తీసిన దాదాపు 100 కు పైగా చిత్రాలు ప్రదర్శనలో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హనీ కాంబ్ నిర్వహించిన ఫొటోగ్రఫీ టాలెంట్‌కు 1000కి పైగా ఫొటోలు ఎంట్రీ కాగా... అందులో నుంచి 100 ఉత్తమ ఫొటోలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.
ఇవీ చూడండి: మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం