తెలంగాణ

telangana

ETV Bharat / state

గృహహింస ఫిర్యాదులకు ఫోన్​లో కౌన్సెలింగ్‌ - Phone counseling for domestic violence complaints in telangana

తెలంగాణ పోలీసులు అధునాతన పరజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. గృహహింస కేసుల పర్యవేక్షణలో ఇకపై ఆన్​లైన్​లోనే నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

phone-counseling-for-domestic-violence-complaints-in-telangana
గృహహింస ఫిర్యాదులకు ఫోన్​లో కౌన్సెలింగ్‌

By

Published : May 24, 2020, 7:26 AM IST

Updated : May 24, 2020, 7:41 AM IST

గృహహింస కేసుల పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. బాధితురాళ్ల ఫిర్యాదు అనంతరం చేపట్టాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే వృత్తి నిపుణులైన కౌన్సెలర్లతో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ వ్యవస్థను మరికొద్ది రోజుల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం గృహహింస ఉదంతాలపై డయల్‌ 100కు కానీ, ఠాణాలకు కానీ ఫిర్యాదులొస్తే తొలుత బాధితురాలి కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా కౌన్సెలింగ్‌ ఇవ్వడం శ్రేయస్కరం కాకపోవడంతో మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా ఆన్‌లైన్‌ విధానానికి శ్రీకారం చుట్టారు. కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చిన 35 మంది నిపుణులతో వేదికను ఏర్పాటు చేశారు. ‘టెలీ సైకాలజీ కౌన్సెలింగ్‌ సెంటర్‌’ పేరుతో యాప్‌ను రూపొందించడంతో పాటు ఒక ప్రత్యేక ఫోన్‌ నంబరును అందుబాటులోకి తెచ్చారు.

అటు డయల్‌ 100కు, ఇటు ఠాణాల పోలీసులకు ఈ నంబరు గురించి సమాచారం ఇచ్చారు. వాటికి ఫిర్యాదు వస్తే బాధితురాలితోనే ఆ నంబరుకు మాట్లాడిస్తున్నారు. ఒకసారి ఫోన్‌ చేసిన కాలర్‌.. మరోసారి అదే నంబరు నుంచి మళ్లీ చేస్తే నేరుగా సంబంధిత కౌన్సెలర్‌కే కనెక్ట్‌ అయ్యేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 150 మంది వరకు గృహహింసపై ఫిర్యాదులు చేస్తుండగా వారందరికీ ఆన్‌లైన్‌లోనే నిపుణులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

ఇదీ చూడండి:విమానాలను ధ్వంసం చేసే లేజర్ అమెరికా సొంతం!

Last Updated : May 24, 2020, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details