కరోనా నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను శుభ్రపరిచారు. సోడియం ఐపో కారైడ్ ద్రావణాన్ని మార్కెట్ మొత్తం పిచికారీ చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఈ రోజు, రేపు మార్కెట్ మొత్తాన్ని పరిశుభ్రం చేశామని... మార్కెట్ ఛైర్మన్ రామ్ నరసింహ గౌడ్ తెలిపారు. అలాగే రైతులకు కోరనా కట్టడిపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.
కరోనా ఎఫెక్ట్: కొత్తపేట పండ్ల మార్కెట్లో మందుల పిచికారీ - కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో కరోనా నివారణ చర్యలు
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించి.. సోడియం ఐపో కారైడ్ ద్రావణం చల్లారు.
కరోనా ఎఫెక్ట్: కొత్తపేట పండ్ల మార్కెట్లో మందుల పిచికారీ
ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ సూచనలతో శని, ఆది వారాలు మార్కెట్ బంద్ చేసినట్టు ఛైర్మన్ ప్రకటించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిస్తామన్నారు. సోమవారం నుంచి యథాతథంగా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించారు.
ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో రక్తానికి కొరత