తెలంగాణ

telangana

ETV Bharat / state

పీజీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - ఓయూ పీజీఈసెట్ ఫలితాలు విడుదల

పీజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్‌ ఫలితాలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్ష కోసం 22వేల 282 మంది దరఖాస్తు చేసుకోగా 16 వేల 807 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

PGECET results released in hyderabad
పీజీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

By

Published : Oct 17, 2020, 7:03 AM IST

పీజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఓయూ నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా తమ ర్యాంకు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ పరీక్ష కోసం 22వేల 282 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 16వేల 807 మంది హాజరయ్యారని అన్నారు. వీరిలో 6,663మంది అమ్మాయిలు... 7793 మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. రాష్ట్రంలోని 22 సెంటర్లలో ఆన్ లైన్ ద్వారా సెప్టెంబరు 21నుంచి 24 వరకు 19 ఆప్షనల్స్‌లో పరీక్ష నిర్వహించారు.

ఇదీ చదవండి:నడిరేయిలో 'పృథ్వీ-2' ప్రయోగం విజయవంతం

ABOUT THE AUTHOR

...view details