తెలంగాణ

telangana

ETV Bharat / state

పీజీఈసెట్​ పరీక్ష షెడ్యూల్​ ఖరారు

రాష్ట్రంలో పీజీఈసెట్​ షెడ్యూల్​ను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంటెక్​, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు.

By

Published : Feb 7, 2019, 9:08 PM IST

పీజీఈసెట్​ పరీక్ష షెడ్యూల్​ ఖరారు

పీజీఈసెట్​ పరీక్ష షెడ్యూల్​ నిర్ణయించిన ఉన్నత విద్యామండలి
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. హైదరాబాద్​లో ఛైర్మన్​ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 129 ఇంజినీరింగ్​ కళాశాలల్లో ఎంటెక్, 96 కాలేజీల్లో ఎంఫార్మసీ, 14 ఫార్మా-బి కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు మార్చి 6న నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 13 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్​లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎస్సీ, ఎస్టీలు 500 రూపాయలు.. ఇతర అభ్యర్థులు 1000 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాలి. మే 25 వరకూ అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
మే 22 నుంచి 27 వరకు వెబ్​సైట్​లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పీజీఈసెట్ కన్వీనర్ కుమార్ తెలిపారు. హైదరాబాద్​, వరంగల్​లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మే 28 నుంచి 31 వరకూ ఆన్​లైన్లో పరీక్ష నిర్వహిస్తామని.. అభ్యర్థులు గమనించాలని సూచించారు. ఉదయం 10 నుంచి 12 వరకూ.. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకూ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details