- గిర్నితండాలో ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు
LIVE UPDATES: గిర్నితండాలో ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు - పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి
13:06 February 27
గిర్నితండాలో ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు
12:24 February 27
గిర్నితండాలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలు, తండా వాసులు
- గిర్నితండాలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలు, తండా వాసులు
- రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఇతర నేతలు
- ఆందోళన కారులను సముదాయిస్తున్న పోలీసులు
- పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట
- జనగామ: ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు
12:21 February 27
ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు: ప్రీతి తండ్రి
- జనగామ: శోకసంద్రంగా వైద్య విద్యార్థిని ప్రీతి స్వస్థలం గిర్నితండా
- ప్రీతిది ఆత్మహత్య కాదు హత్య: ప్రీతి తండ్రి నరేందర్
- ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే: ప్రీతి తండ్రి
- ప్రీతి మృతి కారకులైన అందరి పేర్లు బయటకు రావాలి: ప్రీతి తండ్రి
- బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలి: ప్రీతి తండ్రి నరేందర్
- సైఫ్‌ను అరెస్టుతోనే సరిపెట్టాలని చూస్తున్నారు: ప్రీతి తండ్రి
- సైఫ్‌ను వెంటనే ఉరితీయాలి: ప్రీతి తండ్రి నరేందర్
- అమ్మాయిలను వేధించే వారికి గట్టి హెచ్చరిక పంపాలి: ప్రీతి తండ్రి
- ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు: ప్రీతి తండ్రి
- నా చెల్లి ధైర్యవంతురాలు, ప్రతిభావంతురాలు: ప్రీతి సోదరి
- డిసెంబర్ నుంచే సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి చెప్పింది: ప్రీతి సోదరి
- ఇటీవల సైఫ్ వేధింపులు తీవ్రమయ్యాయి: ప్రీతి సోదరి
- మా చెల్లి మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలి: పూజ
11:01 February 27
కాకతీయ వైద్య కళాశాల ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నం
వరంగల్: కాకతీయ వైద్య కళాశాల ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నం
వరంగల్: ఏబీవీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట
విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
09:49 February 27
నా కూతురు ప్రీతిది ముమ్మాటికి హత్యే: ప్రీతి తండ్రి
నా కూతురు ప్రీతిది ముమ్మాటికి హత్యే: ప్రీతి తండ్రి
సీనియర్ విద్యార్థి సైఫ్ మొదట ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు: ప్రీతి తండ్రి
పక్కా ప్లాన్‌తో చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు: ప్రీతి తండ్రి
ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించాను: ప్రీతి తండ్రి
విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. : ప్రీతి తండ్రి
06:40 February 27
భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు
- జనగామలోని స్వగ్రామానికి చేరుకున్న వైద్య విద్యార్థిని ప్రీతి మృతదేహం
- కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ప్రీతి కుటుంబసభ్యులు, బంధువులు
- భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు
06:10 February 27
పోలీస్ భద్రత మధ్య ప్రీతి మృతదేహం స్వస్థలానికి తరలింపు
- హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ప్రీతి మృతదేహానికి శవపరీక్ష పూర్తి
- పోలీస్ భద్రత మధ్య ప్రీతి మృతదేహం స్వస్థలానికి తరలింపు
- జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకి ప్రీతి మృతదేహం తరలింపు
- నిన్న రాత్రి 9.10 గంటలకు నిమ్స్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి మృతి
- ఈనెల 22 న వరంగల్ ఎంజీఎంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం
- హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్సను అందించిన వైద్యులు
- 5 రోజుల చికిత్స అనంతరం కన్నుమూసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి
- ప్రీతి మృతికి నిరసనగా రాష్ట్రంలో వైద్య కళాశాల బంద్‌కు ఏబీవీపీ పిలుపు