తెలంగాణ

telangana

ETV Bharat / state

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 96.79 శాతం ఉత్తీర్ణత - హైదరాబాద్ తాజా వార్తలు

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 96.79 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు... ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈనెల 12 నుంచి 24 వరకు ఆన్​లైన్​లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.

pg common entrance test results released in hyderabad, పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 96.79 శాతం ఉత్తీర్ణత

By

Published : Jan 7, 2021, 7:53 PM IST

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 96.79 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. అత్యధికంగా ఎంకాం కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఆ తరువాత ఎంఎస్సీ కెమిస్ట్రీ, గణితం కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి 24 వరకు ఆన్​లైన్​లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అన్నారు.

ఈ నెల 20 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్​టీయూహెచ్, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లోని... 54 పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అన్ని కోర్సులకు కలిపి 85వేల 270 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 72వేల 467 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. వారిలో 70వేల 151 మంది అర్హత సాధించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:మరో వారం పాటు వరవరరావు ఆస్పత్రిలోనే: బాంబే హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details