తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీఐ చట్ట సవరణలపై పీఎఫ్ఆర్ఐ నిరసన - ఆర్టికల్ 19(1)(ఎ)

సమాచార హక్కు చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సవరణలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. పీఫుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టూ ఇన్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ధర్నా నిర్వహించారు.

ఆర్టీఐ చట్ట సవరణలపై పీఎఫ్ఆర్ఐ నిరసన

By

Published : Jul 30, 2019, 9:11 PM IST

కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టానికి చేపడుతున్న సవరణలకు వ్యతిరేకంగా పీఎఫ్ఆర్ఐ ధర్నా చేపట్టింది. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు వారు ఆందోళన చేపట్టారు. సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకత పెంచడం కోసం సవరిస్తున్నామంటూ... సవరణ చట్టం ద్వారా ఏం సవరిస్తున్నారో పార్లమెంటుకు కూడా చెప్పకుండా దాచడమే... పారదర్శకత పెంచడమా అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సమాచార హక్కు చట్టాన్ని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం కొనసాగించాలని డిమాండ్​ చేశారు. పార్లమెంట్​ ఆమోదం తెలిపిన బిల్లును... రాష్ట్రపతి తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీఐ చట్ట సవరణలపై పీఎఫ్ఆర్ఐ నిరసన

ABOUT THE AUTHOR

...view details