తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​ ధర మళ్లీ పెరిగింది బాబోయ్​.. - petrole price

కేంద్ర బడ్జెట్​ సాధారణ పౌరుల నడ్డి విరగ్గొంట్టిందంటూ వాహన చోదకులు గగ్గోలు పెడుతున్నారు. చమురు ధర నానాటికీ పైపైకి పోతుంటే జేబులో డబ్బులు ఆవిరైపోతున్నాయంటూ వాపోతున్నారు. శనివారం నుంచి పెట్రోలు ధర మళ్లీ పెరగనున్నందున వాహనదారులు పెట్రోలు బంకులకు క్యూ కడుతున్నారు.

పెట్రోల్​ ధర మళ్లీ పెరిగింది బాబోయ్​..

By

Published : Jul 6, 2019, 12:06 AM IST

బడ్జెట్​లో పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్ సుంకం పెంచటంతో వాటి ధరలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. ఈ బడ్జెట్​లోనైనా చమురు వినియోగదారులకు ఊరట కలుగుతుందనుకుంటే.. రేట్లు పెంచటం ఏంటని వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. ధరలు అదుపు చేయటం మాని.. వినియోగదారుల నడ్డి విరిసేలా చర్యలున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.

పెట్రోల్​ ధర మళ్లీ పెరిగింది బాబోయ్​..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details