Petrol Price: వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో సెంచరీ - హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు
దేశవ్యాప్తంగా పెట్రో మంటలు ఆగడం లేదు. నెల రోజులకు పైగా అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవాళ మరోసారి పెరిగిన ధరలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంధన ధరలు మండుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులపై మోయలేనిభారం పడడమే కాకుండా.. ఆ ప్రభావం రవాణాపై పడి నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలతో పాటు ఇతరత్రా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో సెంచరీ
By
Published : Jun 14, 2021, 1:30 PM IST
చమురు ధరలు మరోసారి పెరగడంతో... హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర వంద మార్క్ దాటింది. ఇవాళ పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెరగడంతో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మొదటిసారి లీటరు పెట్రోలు వంద రూపాయలు దాటింది. వరంగల్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెట్రోల్ లీటరు ధర వంద దాటగా కొన్ని జిల్లాల్లో 102 రూపాయిలు కంటే కూడా ఎక్కువగా ఉంది. ఇవాళ పెరిగిన 30పైసలతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వంద రూపాయలు దాటగా హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.100.20లుగా ఉంది. అదే విధంగా డీజిల్ లీటర్ ధర రూ. 95.14లుగా ఉన్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఇవాళ పెరిగిన ధరల ప్రకారం....
జిల్లా
పెట్రోలు ధర
ఆదిలాబాద్
రూ.102.22
భద్రాద్రి
రూ.101.34
జగిత్యాల
రూ.101.07
జనగాం
రూ.100.26
భూపాలపల్లి
రూ.100.24
గద్వాల్
రూ.101.84
కామారెడ్డి
రూ.101.17
కరీంనగర్
రూ.100.07
ఖమ్మం
రూ.100.25
ఆసిఫాబాద్
రూ.101.81
మహబూబాబాద్
రూ.100.07
మంచిర్యాల
రూ.101.16
మెదక్
రూ.101.20
మేడ్చల్
రూ.100.20
మహబూబ్‌నగర్
రూ.101.15
నాగర్ కర్నూల్
రూ.101.66
నల్గొండ
రూ.100.22
నిర్మల్
రూ.101.74
నిజామాబాద్
రూ.102.08
పెద్దపల్లి
రూ.100.72
సిరిసిల్ల
రూ.100.70
రంగారెడ్డి
రూ.100.38
సంగారెడ్డి
రూ.101.13
సిద్దిపేట
రూ.100.40
సూర్యాపేట
రూ.100.02
వికారాబాద్
రూ.101.24
వనపర్తి
రూ.101.87
యాదాద్రి
రూ.100.30
వరంగల్‌లో ఒక్కచోటనే వంద కంటే తక్కువగా రూ.99.74లుగా పెట్రోల్ లీటరు ధర ఉంది. మరోసారి పెరిగినట్లయితే ఇక్కడ కూడా వంద మార్క్‌ను దాటుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత వారమే అన్ని జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయిల మార్క్‌ను దాటింది.