తెలంగాణ రాష్ట్రంలో... దాదాపు మూడున్నర వేల పెట్రోల్ పంపుల ద్వారా రోజుకు 9 వేల కిలోలీటర్లు డీజిల్, 3 వేల కిలోలీటర్లు పెట్రోల్ అమ్ముడు పోతుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి విక్రయాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్ పంపులు మినహాయించి మిగిలిన పంపులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు మొదట అనుమతి ఉండేది. ఈ నాలుగు గంటలు కాకుండా మధ్యాహ్నం మూడు గంటల వరకైనా పెట్రోల్ పంపులు తెరచుకోడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
పెట్రోల్ పంపులకు పూర్తి మినహాయింపు
మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ పనులు జరుగుతుండడం, ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండడంతో వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడింది. లాక్‌డౌన్ నుంచి పెట్రోల్, డీజిల్ పంపులను పూర్తిగా మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నుంచి పెట్రోల్ పంపులు రోజంతా తెరిచే ఉంటున్నాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రోజులో జరిగే అమ్మకాల్లో అయిదో వంతు వరకు జరుగుతున్నాయని పెట్రోల్ పంపుల నిర్వహకులు చెబుతున్నారు. ఆ తరువాత... విక్రయాలు జరగడం లేదు.
కనిష్ఠస్థాయికి ఇంధన అమ్మకాలు