ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో తాము భాగస్వాములమవుతామని రాష్ట్ర పెట్రో డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తరఫున జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా ఆదివారం పెట్రోల్ డీలర్లందరూ.. తమ సిబ్బందికి సెలవులు ప్రకటించి పెట్రోల్‌బంకుల లావాదేవీలు నిలిపివేయనున్నామని ప్రకటించారు.
జనతా కర్ఫ్యూలో మేము సైతం.. - జనతా కర్ఫ్యూలో పెట్రో డీలర్స్
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో తాము పాల్గొంటామని రాష్ట్ర పెట్రో డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
జనతా కర్ఫ్యూలో మేము సైతం..
అత్యవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒకరిద్దరు సిబ్బందిని, ఒక డెస్పెన్సివ్ యూనిట్‌ను మాత్రమే తెరిచి ఉంచుతామని పేర్కొన్నారు. పెట్రో బంకులు పూర్తి స్థాయిలో రాత్రి 9 గంటల తర్వాత పనిచేస్తాయని రాష్ట్ర పెట్రో డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.