తెలంగాణ

telangana

ETV Bharat / state

మమ్మల్ని చంపేయండి: అధికారుల వద్ద ఓ రైతు తల్లి మొర - మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్

కేసులతో తన కుమారుడిని ఇబ్బందులు పెట్టవద్దని ఓ రైతు తల్లి రోదించింది. రోజూ వేధించే కంటే అధికారులే తమను చంపేయాలని కన్నీటితో వేడుకుంది. నిజాయితీగా ఉండటం కూడా తప్పేనా అని సూటిగా ప్రశ్నించింది. కన్నకొడుకుని చొక్కాపట్టుకుని పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టరే తమకు న్యాయం చేయాలని చేతులు జోడించి గోడు వెళ్లబోసుకుంది. ఏపీ నెల్లూరు జిల్లాకు చెందిన ఆ తల్లి కన్నీటి వెనక ఉన్న కారణం ఏంటి? అసలు ఏం జరిగింది?

petition-to-the-dro-to-withdraw-the-cheating-case-in-nellore
మమ్మల్ని చంపేయండి: అధికారుల వద్ద ఓ రైతు తల్లి మొర

By

Published : Nov 7, 2020, 12:09 PM IST

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రశ్నించిన దళిత రైతుపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన దళిత రైతు జైపాల్​ను ధాన్యం కొనుగోళ్లలో దళారులు మోసగించారు. విషయం అధికారులకు తెలియజేస్తే తిరిగి ఆ రైతుపైనే చీటింగ్ కేసు నమోదు చేశారు. దాంతో అతని తల్లి అచ్చమ్మ.. తెదేపా నేతలతో కలిసి డీఆర్ఓ రమణకు వినతి పత్రం అందజేశారు. తన కుమారుడు నిజాయితీపరుడని, విషయం తెలుసుకోకుండా అతనిపై దొంగతనం ముద్ర వేయడమేమిటని జైపాల్​ తల్లి ప్రశ్నించింది. కేసులతో వేధించే కంటే అధికారులే తమను చంపేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకుని చొక్కా పట్టుకుని పోలీసు స్టేషన్​కు లాక్కెళ్లారని విలపించింది. తప్పు చేయకపోయినా దొంగతనం ముద్రపడిందని, కలెక్టర్​ తమకు న్యాయం చేయాలని ఆ తల్లి వేడుకుంది.

అధికారుల వద్ద రైతు తల్లి ఆవేదన

కేసు పెట్టడం అన్యాయం

రైతు జైపాల్​పై కేసు పెట్టి వేధించడం దారుణమని తెదేపా నేత అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఆ ​కేసు ఉపసంహరించుకోవాలని కోరారు. పాలకులు మారుతుంటారు కానీ అధికారులు నిజాయితీగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దళారీలు.. రైతుల పొట్టకొడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోక పోగా వారిపైనే కేసులు వేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:పంచాయతీలపై విద్యుత్‌ దీపాల భారం!

ABOUT THE AUTHOR

...view details