పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్పీ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని ఇంద్రసేనా రెడ్డి కోరారు. వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
సీఏఏ వ్యతిరేక తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ - సెంబ్లీ తీర్మానం రద్దు చేయాలంటూ ఇంద్రసేనా రెడ్డి పిటిషన్
సీఏఏ, ఎన్ఆర్పీ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భాజపా సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి పిటిషన్ వేశారు.

అసెంబ్లీ తీర్మానం రద్దుపై హైకోర్టులో పిటిషన్