ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ - Petition in the High Court challenging the circular issued by SEC
07:14 December 04
ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
బల్దియా ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
- అసలు ఏమైందంటే..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్న వాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి వచ్చారు. ఇందుకు పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలని ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- భాజపా ఆగ్రహం..
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ సర్కులర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు.