తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవాల కోసం... - MONKEYS

సమాజంలో జంతువులను హింసించి లేబరేటరీలో చంపడాన్ని పెటా ఖండించింది. ఈ దుస్థితిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చింది.

మూగజీవాల కోసం...

By

Published : Feb 27, 2019, 7:28 PM IST

మూగజీవాల కోసం...
జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని జంతువుల పట్ల అనుసరిస్తున్న క్రూరత్వాన్ని వీడాలని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యనిమల్స్​ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో పెటా ఆధ్వర్యంలో ఆ సంస్థ సభ్యురాలు విభూతి వినూత్నంగా జంతువుల అనుసరించే విధానంపై ప్రదర్శన నిర్వహించింది.

కనుమరుగు కానున్న జంతువులు

ప్రయోగాల కోసం మూగజీవాలను కోసి వాటిని విషపూరితంగా మారుస్తున్నట్లు సంస్థ చెబుతోంది. ఇలాగే చేస్తూ పోతే కొంతకాలం తర్వాత జంతువులే కనుమరుగవుతాయని ఆ సంస్థ ప్రచార కన్వీనర్ రాధిక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రంపై ఒత్తిడి

ప్రయోగశాల్లో మూగజీవుల వినియోగంపై నిషేధం విధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పెటా సిబ్బంది తెలిపారు.

ఇవీ చదవండి:ప్రేమిస్తే చంపే హక్కుందా?

ABOUT THE AUTHOR

...view details