హైదరాబాద్ టూ దిల్లీకి సైక్లింగ్.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్ చిన్న సైకిల్.. దాని వెనక జాతీయ పతాకంతో ముందుకెళ్తున్న యువకుని పేరు ఆనంద్ కుమార్ గౌడ్. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన 26 ఏళ్ల ఆనంద్... మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
ఆదర్శంగా నిలవాలని..
ఏదైనా సాధించి నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకున్న ఆనంద్.. తన నిత్య కార్యకలాపాలతోనే రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది జనవరి 10న హైదరాబాద్ మెహదీపట్నం నుంచి తిరుపతి వరకు 650 కిలోమీటర్లు జాగింగ్ చేశాడు. లాంగెస్ట్ జాగింగ్ విభాగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.
హైదరాబాద్ టూ దిల్లీకి సైక్లింగ్.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్ రోజుకు 200 కిలోమీటర్ల సైక్లింగ్!
తాజాగా హైదరాబాద్ నుంచి దిల్లీకి తక్కువ రోజుల్లో సైక్లింగ్ చేసి రికార్డు నెలకొల్పేందుకు సంకల్పించాడు. డిసెంబర్ 17న హైదరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ దిల్లీ బయలుదేరాడు. రోజూ 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసినట్లు చెప్పాడు. తీవ్ర చలిగాలులు, పొగమంచు కప్పుకుని విజిబిలిటీ తగ్గినా తన సంకల్పంతో సైకిల్ ఫెడల్ ముందుకు కదిలినట్లు పేర్కొన్నాడు. మొత్తం 1550 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఏడు రోజులకు హస్తిన చేరుకున్నానని ఆనందం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్ టూ దిల్లీకి సైక్లింగ్.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్ ప్రారంభంలోనే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపాడు. సైక్లింగ్ పూర్తైనట్లు వారికి సమాచారం ఇచ్చామన్నారు. త్వరలోనే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు... ఈ యువ వ్యాయామ ఉపాధ్యాయుడు.
హైదరాబాద్ టూ దిల్లీకి సైక్లింగ్.. వ్యాయామ ఉపాధ్యాయుడి రికార్డ్ ఇవీచూడండి:తరతరాలకూ యాదికుండేలా... సర్వాంగ సుందరంగా యాదాద్రి క్షేత్రం