తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగినోడితో ఓటు వేయించడం మామూలు పని కాదు - పెనుగంచిప్రోలు పంచాయతీ ఎన్నికలు వార్తలు

ఫూటుగా మద్యం తాగి ఉన్న వ్యక్తి చేత ఓటు వేయించేందుకు తంటాలు పడ్డారా స్థానికులు.. ఎంతో కష్టపడి పోలింగ్ కేంద్ర వరకు తీసుకువెళ్లారు.. మద్యం మత్తు నషాళానికి అంటుకుందో ఏమో మరి.. బ్యాలెట్ పేపర్​ మీద ముద్ర వేసేందుకు ఓపిక లేనంతగా తుళ్లి పడి.. పోలింగ్ కేంద్రంలోనే చతికిలపడ్డాడు. మరి తరువాత ఏమయ్యిందంటే..!

తాగినోడితో ఓటు వేయించడం మామూలు పని కాదు
తాగినోడితో ఓటు వేయించడం మామూలు పని కాదు

By

Published : Feb 10, 2021, 2:00 PM IST

రోడ్డు పక్కనే పడి ఉన్న వ్యక్తికి ముఖం కడిగి.. పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించేందుకు ప్రయత్నించారు స్థానికులు. ఓటు వేసేంతసేపు కూడా నిలబడే ఓపిక అతడికి లేకపోవడంతో ఇదిగో ఇలా దగ్గరుండి బ్యాలెట్‌ పేపర్‌పై ముద్ర వేయించి మమ అనిపించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఈ చిత్రాలు కనిపించాయి.

ABOUT THE AUTHOR

...view details