తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట్రావు లక్ష్మిలు చాలా సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. కొన్నినెలల క్రితం వరకూ ఫతేనగర్‌లో ఉండేవారు. ఇటీవలే బోయినపల్లిలోని కంసాలి బజార్‌కు వచ్చారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించాడు...
వెంకట్రావు కుమారుడు భాస్కర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బంధువులకు చెందిన ప్లాస్టిక్ మోడలింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను కుత్బుల్లాపూర్‌లోని ఓ యువతిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు...
భాస్కర్ వివాహం అనంతరం సరిగా విధులకు వెళ్లడం లేదు. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈనెల 11వ తేదీన తన భార్యను పుట్టింటికి పంపించిన అతను తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉన్నాడు.
అర్ధరాత్రి సమయంలో...
రాత్రి భోజనం చేశాడు. పడక గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో అలికిడి అయ్యింది. అతని తల్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ.. అతను అప్పటికే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు శిక్ష