Speeding is dangerous: ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతూ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ ప్రధాన రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డ ప్రేమ నగర్ కు చెందిన కాడి ఆనంద్‌కుమార్(24) ఎస్బీఐ బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్నాడు. బుధవారం కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. ఫంక్షన్ ముగించుకొని ద్విచక్ర వాహనం పై వేగంగా వెళ్తుండగా, వివేకానందనగర్‌లో అతని వాహనం అదుపు తప్పి కిందపడింది. తీవ్రగాయాలపాలైన యువకుడ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తలకు హెల్మెట్ కూడా లేకపోవడంతో మృతి చెందాడు
స్పీడ్‌గా వెళ్లాడు .. స్పీడ్ బ్రేకర్ వచ్చింది.. మృతి చెందాడు - హైదరాబాద్‌లో వ్యక్తి అతివేగం
Speeding is dangerous: అతి వేగం ప్రమాదకరం అని పెద్దలు, పోలీసులు అధికారులు, స్నేహితులు..వ్యక్తులు చెప్తుతూనే ఉంటారు. అయిన కొందరు పట్టించుకోకుండా ప్రాణాలు పొగొట్టుకుంటారు. అలానే హైదరాబాద్‌లో ఒక వ్యక్తి మృతి చెందాడు.
అతి వేగం ప్రమాదకరం
యువకుడి ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. మితిమీరిన వేగంతో వాహనం నడపటం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని.. వాటి వల్ల ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలతో బయటపడగలమని, వాహనదారులు ట్రాఫిక్ నిబధనలు పాటించాలని కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 15, 2022, 5:02 PM IST