ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గట్టు భీమవరం జీఎంఆర్ టోల్ గేట్ బోర్డుకు ఒక వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టోల్గేటు బోర్డుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - భీమవరం జిఎంఆర్ టోల్ గేట్ న్యూస్
ఏపీ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గట్టు భీమవరం జీఎంఆర్ టోల్‌గేట్ బోర్డుకు ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
టోల్గేటు బోర్డుకు ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి
ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేసి టోల్‌గేట్ బోర్డుకి ఉరి వేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు