కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనాలను తగలబెడుతూ.. ఇంటిపై రాళ్లు వేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి పైనే ఇలా జరుగుతున్నందున బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు మూడు రోజులుగా ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహించి నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడు ఖురేషి ఇంట్లో గుట్టలు గుట్టలుగా రాళ్లు, నిమ్మకాయలు ఇతర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. మూఢనమ్మకాల పేరుతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు.
'చేతబడి పేరుతో ఇళ్లపై రాళ్లు, నిమ్మకాయలు' - Man arrested for throwing stones at houses in Kulsumpura
కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధి సబ్జిమండి బస్తీలో ఇళ్లపై రాళ్లు వేస్తు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఖురేషి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చేతబడుల పేరుతో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చేతబడి పేరుతో ఇళ్లపై రాళ్లు, నిమ్మకాయలు వేస్తున్న వ్యక్తి అరెస్ట్