రాష్ట్ర పర్యటక శాఖ సేవలు టీఎస్-ఐపాస్‌తో అనుసంధానం చేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ విండో ద్వారా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలకు అనుమతులు లభించనున్నాయి. ఈ మేరకు టీఎస్-ఐపాస్‌లో పర్యటకశాఖ సేవలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శ్రీకారం చుట్టారు. దీని ద్వారా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీ ఒక దరఖాస్తు ద్వారా... కేవలం 30 రోజుల్లోనే అనుమతులు పొందవచ్చు.
సింగిల్ విండో ద్వారా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలకు అనుమతులు - మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తాజా వార్తలు
సింగిల్ విండో ద్వారా.. హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, ఈవెంట్స్‌కు టీఎస్-ఐపాస్ ద్వారా అనుమతులిచ్చే ప్రక్రియను.. పర్యటక శాఖ మొదలుపెట్టింది. దీని కోసం ఐటీ శాఖ భాగస్వామ్యంతో పర్యాటక శాఖ సేవలను.. టీఎస్-ఐపాస్‌తో అనుసంధానించారు. ఈ మేరకు టీఎస్-ఐపాస్‌లో పర్యాటక శాఖ సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. రాష్ట్రానికి పర్యాటకంలో చాలా అవకాశం ఉందని చెబుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.
సింగిల్ విండో ద్వారా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలకు అనుమతులు
టీఎస్ ఐపాస్ విధానానికి తెలంగాణ పర్యటక శాఖ సేవలను అనుసంధానం చేయడం ఓ చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. మలేషియా, సింగపూర్ తదితర దేశాలు పర్యాటక ఆదాయంపైనే అభివృద్ధి సాధిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో తెలంగాణ టూరిజం మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. రామప్ప లాంటి ప్రముఖ ఆలయాలు ప్రపంచ పర్యాటక పటంలోకి త్వరలోనే చేరుతాయని వివరించారు.
ఇదీ చూడండి :ఓఆర్‌ఆర్‌పై బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణనష్టం