కొవిడ్ నిబంధనలు సడలిస్తుండటం వల్ల ఏపీ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో వివాహాలు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20 నుంచి స్వామివారి దర్శనాలతో పాటు దేవస్థానంలో వివాహాలు నిలిపివేశారు. ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు సడలించి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నా.. పెళ్లిళ్లకు మాత్రం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు.
'అన్నవరం దేవస్థానంలో పెళ్లిళ్లకు అనుమతి' - latest news on annavaram
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. పరిమిత సంఖ్యలో, నిబంధనలు పాటిస్తూ వివాహాలు చేసుకునేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు. నాలుగైదు రోజుల్లో ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభించనున్నారు.
!['అన్నవరం దేవస్థానంలో పెళ్లిళ్లకు అనుమతి' permission-to-marriages-at-annavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9154363-77-9154363-1602549956921.jpg)
'అన్నవరం దేవస్థానంలో పెళ్లిళ్లకు అనుమతి'
వివాహ ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో, నిబంధనలు పాటిస్తూ వివాహాలు చేసుకునేందుకు దేవస్థానంలో కల్యాణమండపాలు, హాళ్లు, స్థలాలు కేటాయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. నాలుగైదు రోజుల్లో ముందస్తు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు.
ఇదీ చూడండి:వర్షాన్ని లెక్కచేయకుండా యాదాద్రికి పోటెత్తిన భక్తులు