తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai: 'వైరస్​, పర్యావరణ ప్రమాదాలపై సమష్టిగా పోరాడుదాం'

రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

Governor Tamilisai
గవర్నర్ తమిళిసై

By

Published : Oct 14, 2021, 6:59 PM IST

విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రులు అందరిలోనూ సంతోషం, ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా నిర్వహించుకునే దసరా పండగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. సత్యమేవ జయతే మన దేశ సిద్ధాంతమన్న గవర్నర్... రోగ కారక వైరస్​లు, పర్యావరణ ప్రమాదాలపై అందరం సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.

దసరా సందర్భంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్థించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి పండుగ చేసుకోవాలని గవర్నర్ ప్రజలను కోరారు. దసరా సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ రాజ్​భవన్​లో పూజలు చేశారు. ఆయుధ పూజ, వాహనపూజ, పుస్తకపూజలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. కుటుంబసభ్యులు, సలహాదారులు, అధికారులు, సిబ్బందితో కలసి పూజలు నిర్వహించారు. రాజ్​భవన్ గ్రంథాలయంలో కలియతిరిగిన గవర్నర్... పాతపుస్తకాలు ఎంతో విలువైన సంపద అని అన్నారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవాలని పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా రాజ్​భవన్​లో గవర్నర్ జమ్మిమొక్క నాటారు.

తెలంగాణకు గవర్నర్​గా నియమితులైన తర్వాత తమిళిసై సౌందరరాజన్ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకున్నారు. తెలంగాణ బాషను, పండుగలను ప్రేమిస్తు వచ్చారు. రాజ్​భవన్​లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులతో పాటు గవర్నర్​ సైతం బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సీఎం శుభాకాంక్షలు..

పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ(saddula bathukamma 2021) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు(saddula bathukamma wishes in telugu) తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్పూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details