దిశ హత్యాచార ఘటన అనంతరం మహిళల రక్షణ కోసం మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేకు అనుమతి - Pepper spray allowed in Hyderabad Metro rails
దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో భాగ్యనగరంలో మహిళలు మెట్రోలో పెప్పర్ స్ప్రే తీసుకువెళ్లడానికి అనుమతిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో మెట్రో రైలు భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

భాగ్యనగర మెట్రోలో పెప్పర్ స్ప్రేకు అనుమతి
ఇప్పటికే బెంగుళూరు మెట్రో రైలులో పెప్పర్ స్ప్రేకు అనుమతి ఇస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో రైళ్లలో మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేకు అనుమతి
ఇదీ చూడండి : 'లక్ష్మీనరసింహస్వామి నాలుక ఎక్కడైనా బయటికే ఉంటుంది'
Last Updated : Dec 4, 2019, 10:53 PM IST