తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయం చేసే గుణమే ఇప్పుడతన్ని ఆదుకుంటోంది

ఆపదలో ఉన్న వారికి చేసే చిన్న సహయం మనం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో విధంగా ఎవరో ఒకరు ఆదుకుంటారని పెద్దలు చెబుతునే ఉంటారు. ఏపీలోని కర్నూలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఆటోడ్రైవర్ చేసిన చిన్న సహయం తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కొండంతా అండగా నిలించింది. తన కూతురు ఆసుపత్రిలో ఉంటే..చాలామంది సహాయం చేశారు.

By

Published : Oct 3, 2020, 12:07 AM IST

సాయం చేసే గుణమే ఇప్పుడతన్ని ఆదుకుంటోంది
సాయం చేసే గుణమే ఇప్పుడతన్ని ఆదుకుంటోంది

ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన మధుసూదన్ ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నాడు. మధుసూదన్ ఎవరికైన రక్తం కావాల్సి వస్తే అందుబాటులో ఉండి రక్తదానం చేసేవాడు... గర్బిణి స్త్రీలను ఉచితంగా ఆటోలో తీసుకెళ్లేవాడు. ఈసేవా కార్యక్రమాలు చేస్తూ.. మధుసూదన్ డోన్ పట్టణంలో గుర్తింపు పొందాడు. గతనెలలో అతని కుతూరు రచన శ్రీ ఇంట్లో ప్రమాదవశాత్తు వేడి నీళ్లలో పడి దాదాపు 70 శాతం శరీరం కాలిపోయింది. ఆమెకు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మధుసూదన్ ఆపదలో ఉన్నాడని తెలుసుకున్న అతని స్నేహితులు ..తనని ఆదుకోవాలని సామాజిక మధ్యమాల్లో పోస్టులు పెట్టారు. స్పందించిన దాతలు అతని సేవా కార్యక్రమాలను తెలుసుకొని మూడురోజుల్లో దాదాపు 20 లక్షల రూపాయలు అతని బ్యాంక్ ఖాతాల్లో జమ చేయగా కొందరు స్వయంగా ఆసుపత్రికి వచ్చి నగదు సహయం చేశారు. చిన్నారికి ఎక్కువ శాతం కాలినందున పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. తనకు సహయం చేసిన వారందిరి మధుసూదన్ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని దాతలు కోరుతున్నారు..

ఇదీ చూడండి:జనగాంలో వర్గపోరు.. పొన్నాల, జంగా వర్గాల తోపులాట..

ABOUT THE AUTHOR

...view details