వేసవి కాలం కావడం... మరోవైపు లాక్డౌన్ కొనసాగడం వల్ల మూగజీవాల పరిస్థితి దయనీయంగా తయారైంది. తిండి, నీరు లేక ఆకలికి అలమటిస్తున్నాయి. అటు మూగజీవాలకు పీపుల్ ఫర్ అనిమల్స్ సంస్థ అండగా నిలిచింది. సికింద్రాబాద్ పద్మారావు నగర్ వద్ద మూగజీవాలకు బిస్కెట్లు, నీటిని సంస్థ సభ్యులు అందించారు. వాటి ఆకలిని తీర్చారు. మనుషులు తమ ఆకలి గోడును చెప్పే అవకాశముంది... కానీ మూగజీవాలకు అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాటి ఆకలిని తీర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంస్థ సభ్యులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు మూగజీవాలకు పరిసర ప్రాంత ప్రజలు ఆహారం, నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు.
మూగజీవాలకు పీపుల్ ఫర్ అనిమల్స్ సంస్థ ఆసరా - Peoples for Animals food distribution
మూగజీవాలకు పీపుల్ ఫర్ అనిమల్స్ సంస్థ ఆసరాగా నిలుస్తోంది. సికింద్రాబాద్ పద్మారావునగర్ వద్ద మూగజీవాలకు తాగునీటిని, బిస్కెట్లను అందించి... వాటి ఆకలిని తీర్చారు సంస్థ సభ్యులు.
పీపుల్స్ ఫర్ అనిమల్స్ సంస్థ