హైదరాబాద్ నగరంలో నిత్యావసరాల కోసం జనం బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా దుకాణాల వద్ద గుమిగూడారు. మాంసం, కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్ల వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు.
ఆదివారం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో జనాలు అధికంగా చేపలు, మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మాంసం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. పలుచోట్ల వ్యక్తిగత దూరం పాటించకుండానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. లాక్డౌన్ భయంతో జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రహదారులు రద్దీగా దర్శనమిస్తున్నాయి. దుకాణాల ఎదుట బారులు తీరిన ప్రజలకు పోలీసులు సామాజిక దూరం పాటించేలా సూచిస్తున్నారు.