కరోనా వైరస్ను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్, మోండా మార్కెట్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రజలంతా జనతా కర్ఫ్యూను పాటిస్తుండడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రాంతాల్లో సైతం ఒక్కరు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
జనాలు లేక బోసిపోయిన రైల్వే స్వేషన్లు, రహదారులు - latest news on peoples are Volunteerly participating in janatha curfew in hyderabad
నిత్యం వాహనాలు, ప్రజలతో కిక్కిరిసిపోయే నగరంలోని రోడ్లన్నీ జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా మారాయి. రైల్వే శాఖ సైతం 2,600 ప్యాసింజర్, 1,300 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడం వల్ల రైల్వే పరిసరాలూ బోసిపోయాయి.
జనాలు లేక బోసిపోయిన రైల్వే స్వేషన్లు, రహదారులు
సికింద్రాబాద్లోని ప్రముఖ ఆలయాలు, చర్చిలు సైతం మూతపడ్డాయి. రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడం వల్ల రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికులను ట్రాఫిక్ పోలీసులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డిజాస్టర్ ఫోర్స్ యాంటీ వైరస్ను పిచికారీ చేశారు. ప్రజలంతా సంఘటితంగా ఉండి కర్ఫ్యూకు సహకరించడం వల్ల దుకాణాలు, మాల్స్ పూర్తిగా మూతపడ్డాయి.
ఇదీ చదవండి:నగరానికి తాళం వేసి కరోనాపై కసితీరా గెలిచి