హైదరబాద్‌లో వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపై కనిపించాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, ఆబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, బేగంపేట ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వాహన రాకపోకలు సాధారణ రోజులను తలపించాయి. అధిక సంఖ్యలో వాహనాలు రావడం వల్ల కొన్ని కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు స్పందించి కొన్ని చోట్లా వాహనాలను స్వాధీనం చేసుకున్నా.. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌లో చిక్కుకుని.. స్వస్థలాలకు వెళ్లే వారు, నిర్మాణ పనులకు అనుమతినివ్వడం వల్ల సామగ్రి తరలింపు వాహనాలు రోడ్లపై కనిపించాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని నియంత్రించినట్లు చెప్పారు.
యువకుల విన్యాసాలు...
యువకుల్లో కొందరు వాహనాలతో విన్యాసాలు చేస్తున్నారు. పాతబస్తీ, నయాపూల్, నాంపల్లి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, అమీర్‌పేట ప్రాంతాల్లో ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు, ముగ్గురు వెళ్తూ కనిపించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల ప్రతి చెక్‌పోస్టు, కూడలి వద్ద వాహనాలను నిలిపి తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.