తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితిలో శిరస్త్రాణం తియ్యరు.. ఎందుకంటే.. - road safety news

హెల్మెట్​ ధరించాలని ట్రాఫిక్​ పోలీసులు ఎంత మొత్తుకున్నా.. వేలకు వేలు జరిమానా విధించినా చాలా ప్రాంతాల్లో శిరస్త్రాణం లేకుండా వెళుతున్నవారు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఓ ప్రాంతంలో ద్విచక్రవాహనంపైనే కాదు.. రోడ్డుపై నడుచుకుంటూ, సైకిల్​, కారులో వెళ్లేవారు వృత్తి, వయస్సు, లింగభేదం లేకుండా హెల్మెట్​ ధరిస్తున్నారు. మరి ఆ ప్రాంతం ఎక్కడుంది? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం.

people wear helmet during walking car driving in dayalbagh agra
ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితిలో శిరస్త్రాణం తియ్యరు.. ఎందుకంటే..

By

Published : Feb 22, 2020, 2:14 AM IST

Updated : Feb 22, 2020, 7:20 AM IST

ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితిలో శిరస్త్రాణం తియ్యరు.. ఎందుకంటే..

హెల్మెట్​.. ద్విచక్రవాహనదారులకు రక్షణకవచం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. అందుకే ద్విచక్రవాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. శిరస్త్రాణం లేకుండా రోడ్డెక్కితే.. వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్​ పోలీసులు. అయినా చాలా చోట్ల శిరస్త్రాణం లేకుండా వెళ్తన్న ద్విచక్రవాహనదారులు కనిపిస్తూనే ఉంటారు.

ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం ఆగ్రాలోని దయాల్​బాగ్​లో శిరస్త్రాణం ప్రాముఖ్యత గుర్తించి ద్విచక్రవాహనదారులే కాదు, సైకిల్​, కారు నడిపేవారితో పాటు పాదచారులు కూడా హెల్మెట్​ను ధరించి అవగాహన కల్పిస్తున్నారు.

రోడ్డుభద్రతపై సందేశం..

దయాల్​బాగ్​ ప్రజలు రోడ్డు ప్రమాదాలనుంచి రక్షించుకునేందుకు హెల్మెట్​ను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. యువకులు, చిన్నారులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, మహిళలు, పురుషులు, ముసలివారు వయసు తేడా లేకుండా హెల్మెట్​ను ధరించి రోడ్డు భద్రతపై ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.

కారణం ఇదీ..

ఇటీవల రోడ్డు భద్రత, ట్రాఫిక్​పై​ అవగాహన కల్పించారు అధికారులు. హెల్మెట్​ ధరిస్తే కలిగే ఉపయోగాలను సవివరంగా చెప్పారు. అధికారుల సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు దయాల్​బాగ్ ప్రజలు. పాదచారులు, సైకిల్​, కారులో రోడ్డుపై వెళుతున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం పొంచి ఉందో ఊహించలేమని అందుకే హెల్మెట్ ధరిస్తున్నట్లు చెబుతున్నారు.

" 70 ఏళ్ల వరకు ఉన్న మహిళలు స్వీయరక్షణ కోసం ఊతకర్రను ఉపయోగిస్తున్నారు. అది జీవితంలో ఒక భాగం. వ్యాయామంలో భాగంగా కర్రను తీసుకెళుతున్నాం. అలాగే హెల్మెట్​ కూడా రక్షణ ఇస్తుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు ఢీ కొడతారో తెలియదు కదా."

- ఇందు మిశ్రా, దయాల్​బాగ్​ నివాసి.

రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు పెరుగుతున్న కారణంగా హెల్మెట్​ను తప్పనిసరిగా చేసుకున్నామని మరికొందరు చెబుతున్నారు. ముఖ్యంగా సైకిల్​, ద్విచక్రవాహనంపై వెళుతున్న వారు తప్పనిసరిగా ధరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు శిరస్త్రాణం ధరించటాన్ని ప్రేరణగా తీసుకుని సమీప ప్రాంతాల వారూ హెల్మెట్ వాడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

" మా యజమాని ఆదేశాలు మేము అనుసరిస్తాం. భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని మా యజమాని చెప్పారు. ఈ కారణంగానే హెల్మెట్​ ధరించి కారులో ప్రయాణిస్తున్నాం."

- మీనాక్షి, భాస్కర్​, దయాల్​బాగ్​ నివాసి

ఇదీ చూడండి:ట్రంప్ తాజ్​మహల్​ పర్యటనకు కోతుల బెడద

Last Updated : Feb 22, 2020, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details