తెలంగాణ

telangana

ETV Bharat / state

Drainage Water: రోడ్డుపై మురుగు నీటితో స్థానికుల అవస్థలు

అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతోంది. 10 రోజులుగా డ్రైనేజీ పొంగి రహదారి వెంట పారుతున్నా పట్టించుకునే వారు లేరని స్థానికులు అంటున్నారు. మురుగునీటి దుర్బంధం భరించలేకపోతున్నామని మండిపడుతున్నారు.

people suffering due to drainage water leakage in hyderabad nizampet kamaan
రోడ్డుపై మురుగు నీటితో స్థానికుల అవస్థలు

By

Published : Jun 9, 2021, 7:03 PM IST

Updated : Jun 9, 2021, 7:22 PM IST

హైదరాబాద్​ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్​లో డ్రైనేజి నీరు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. కమాన్​ వద్ద 10 రోజులుగా మురుగు నీరు రోడ్డుపైకి వస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మురుగునీటి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

మురుగు నీరు రోడ్డుపైకి వస్తుండటం వల్ల వ్యాపారులు, చేపల అమ్మకందారులు, పళ్ల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి భూగర్భ డ్రైనేజికి మరమ్మతులు నిర్వహించాలని, మురుగు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

Last Updated : Jun 9, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details