People Struggled With CM Jagan Tour : ఏపీ శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లకు ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర బారికేడ్లు పెట్టడంతో విద్యార్థులు, స్థానికులు వాటి కింద నుంచే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు నరసన్నపేట ఖాకీపేటగా మారింది. శ్రీకాకుళం జిల్లానే కాకుండా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి అదనపు బలగాలను మోహరించారు. సుమారు రెండు వేల మంది పోలీసుల దిగ్బంధంలో నరసన్నపేట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సులు, ఆటోలు లేక విద్యార్థులు నడుచుకుంటూ కళాశాలలకు వెళ్తున్నారు.
అష్టదిగ్బంధనంలో నరసన్నపేట.. ప్రజలకు తప్పని వెతలు
People Struggled With CM Tour : ఏపీ సీఎం పర్యటన సందర్భంగా నరసన్నపేటను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సభా వేదిక కోసం జూనియర్ కళాశాల మైదానంలో రెండు చోట్ల ప్రహరీ గోడతో పాటు చెట్లను కూల్చేశారు.
narasannapeta
మరోవైపు సభా వేదిక కోసం జూనియర్ కళాశాల మైదానంలో రెండు చోట్ల ప్రహరీ గోడతోపాటు చెట్లను కూల్చివేశారు. అధికారుల నిర్వాకంతో డిగ్రీ పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడ్డారు. కళాశాల రోడ్డులో దుకాణాలు మూసివేశారు. కూరగాయల దుకాణాలను అక్కడి నుంచి తరలించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినప్పుడూ ఈ స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదంటూ.. పోలీసు ఆంక్షలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: