రేషన్ డబ్బుల కోసం రోజు నాలుగు నుంచి ఐదు వందల మంది లబ్ధిదారులు హైదరాబాద్ అబిడ్స్‌లోని జనరల్ పోస్టు ఆఫీసు కార్యాలయానికి తరలి వస్తున్నారు. అయితే తమ పరిమితి ప్రకారం రోజు రెండు వందల మందికి రూ. పదిహేను వందలు ఇస్తున్నట్లు పోస్టు ఆఫీస్ కార్యాలయ అధికారులు తెలిపారు.
అబిడ్స్‌లో రేషన్ డబ్బు కోసం బారులు తీరిన ప్రజలు - అబిడ్స్ పోస్టాఫీస్ తాజా వార్తలు
హైదరాబాద్ అబిడ్స్‌లోని పోస్టాఫీస్ కార్యాలయానికి రేషన్ డబ్బుల కోసం ప్రజలు తరలివస్తున్నారు. లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వం రూ. 1500 లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేసిందని.. రోజుకు 4 నుంచి 5 వందల మంది వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే డబ్బు జమా కానీ వారు ఆధార్ కార్డు, రేషన్ నెంబర్లను కార్యాలయంలో ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
అబిడ్స్‌లో రేషన్ డబ్బు కోసం బారులు తీరిన ప్రజలు
లాక్ డౌన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పదిహను వందల రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేసిందని... అయితే కొంత మంది రానివారు ఆధార్ కార్డు, రేషన్ నెంబర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టు ఆఫీసు కార్యాలయాలలో ఇస్తున్నట్లు వారు చెప్పారు. దీంతో అబిడ్స్ జీపీఓలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తరలివస్తున్నారు. భౌతిక దూరం పాటించే విధంగా పోలీసులు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక