రాబోయే 18 రోజుల్లో ప్రజలు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కోరారు. గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రతివార్డులో, ప్రతీ ఫ్లోర్లో చేకింగ్ చేయిస్తున్నామని అన్నారు. గతంలో వైద్యులపై జరిగిన దాడి దృష్ట్యా సూపరింటెండెంట్‌తో పరిస్థితిని సమీక్షించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలుపుతూ మిఠాయిలు, బిస్కెట్లు పంచారు.
'వచ్చే 18 రోజులు ప్రజలు కచ్చితంగా సహకరించాలి' - hyderabad latest news
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈనెల 30 వరకు పొడగించిన సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. రానున్న 18 రోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు వందశాతం సహకరించాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును ఆయన పరిశీలించారు. రానున్న రోజుల్లో కరోనా తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'వచ్చే 18 రోజులు ప్రజలు కచ్చితంగా సహకరించాలి'
ఆస్పత్రిలో 200 మందికిపైగా పోలీసులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్రధాన గేటు వద్ద రెండంచెల భద్రత ఉందన్నారు. ఏసీపీ అధ్వర్యంలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లతోపాటు మిగిలిన సిబ్బంది ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు సీపీ వివరించారు.
ఇదీ చూడండి :లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో భాజపా కమిటీలు
Last Updated : Apr 12, 2020, 5:40 PM IST