లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత బాధ్యతాయుతంగా ప్రజలు సహకరించాలని అప్పుడే కలిసికట్టుగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పిలుపునిచ్చారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్... లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు.
అధికారిక ప్రకటనలే నమ్మాలి...
ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని సూచించారు. ప్రజల అవసరాలు దృష్ట్యా... కూరగాయల, నిత్యావసర మార్కెట్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటాయని వెల్లడించారు. ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్లకూడదని... తప్పనిసరిగా మాస్క్‌లు ధరించే వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ నివారణకు నియంత్రణ ఒక్కటే మార్గమని... ప్రభుత్వం ఇచ్చే బియ్యం, నగదు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. నిర్లక్ష్య ధోరణే వైరస్ వ్యాప్తికి కారకం అవుతుందన్న మంత్రి నిరంజన్‌రెడ్డి... అభివృద్ది చెందిన దేశాలే వైరస్ ధాటికి విలవిలలాడుతున్నాయని గుర్తు చేశారు. దూరదృష్టితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయని స్పష్టం చేశారు.
ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకెళ్లరాదు : నిరంజన్ రెడ్డి ఇవీ చూడండి ; ఒక్కరికే అనుమతి.. అదీ మూడు కిలోమీటర్లలోపే!