వర్షాకాలంలో ప్రజలు అంటువ్యాధుల భారీన పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్ సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ ముఠా పద్మానరేష్ గాంధీనగర్ డివిజన్ విష్ణు రెసిడెన్సీ ఏ బ్లాక్లో పూల కుండీల కింద ఉన్న ప్లేట్లలో పేరుకుపోయిన నీటిని శుభ్రం చేశారు.
'అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - musheerabad MLA Muta Gopal Updates
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. వానాకాలంలో ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Hyderabad latest news
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతోపాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఠా గోపాల్ సూచించారు. జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆధారపడకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.