హైదరాబాద్ కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో 11 డివిజన్లుంటే వాటిల్లో 7 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో ఒకటి పీహెచ్‌సీ, మిగతా 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు. ఈ 7 కేంద్రాల్లో వారంరోజులుగా కొవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనం ఎక్కువగానే వస్తున్నారు.
ఫిరోజ్‌గూడ నుంచి కేపీహెచ్‌బీకి మార్పు
- వారంరోజులుగా బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఫిరోజ్‌గూడ సామాజిక భవనంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానికులు వందలాది మంది ఇప్పటికే పరీక్షలు చేయించుకున్నారు. కొద్దిరోజులుగా ఈ కేంద్రాన్ని తొలగించాలని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- జనావాసాల మధ్య ఉండడం వలన స్థానికంగా కరోనా వ్యాప్తి చెందుతుందని ఒత్తిడి చేస్తుండడంతో వైద్యులు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇక చేసేదిలేక బుధవారం ఈ కేంద్రాన్ని కేపీహెచ్‌బీకాలనీ రమ్యా మైదానం వద్దకు మార్పుచేశారు.
- హనుమాన్‌నగర్ ఆరోగ్య కేంద్రం వారు పాపిరెడ్డినగర్ పార్కు వద్ద జీహెచ్‌ఎంసీ భవనంలో పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీన్ని తొలగించాలని స్థానిక మహిళ వైద్యురాలిపై ఒత్తిడి తీసుకొస్తోంది.
- ఎల్లమ్మబండ పరీక్షా కేంద్రం పక్కనే వాటర్ ట్యాంక్ ఉండడంతో పరీక్షలు నిలిపేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారు.