తెలంగాణ

telangana

ETV Bharat / state

భూమి పంచాలని.. వైరాలో దళితుల ధర్నా - భూమి పంచాలని దళితుల ధర్నా

ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని అష్ణగుర్తి ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని కోరుతూ.. దళితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసి ధర్నా నిర్వహించారు. కాలనీలో పేదలకు ఇళ్లు లేక, ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

People Protest For Houses In Khammam District Wayra
భూమి పంచాలని.. వైరాలో దళితుల ధర్నా

By

Published : Oct 4, 2020, 5:36 PM IST

ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని కోరుతూ.. దళితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసి ధర్నా చేశారు. కాలనీలో నిరుపేదలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని.. కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూములు తమకు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

కొన్నేళ్లుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నా.. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని.. తాజాగా.. ప్రభుత్వ భూమిని మొక్కల పెంపకం కోసం కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్న ఆ భూమిని తమకే కేటాయించాలని.. ఉండడానికి ఇల్లే లేకపోతే.. పార్కులెందుకని ప్రశ్నించారు.

ఇవీ చూడండి:'అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానమే చెబుతుంది'

ABOUT THE AUTHOR

...view details