ప్ర. మీ ప్రధాన సమస్య ఏంటి?
జ. ఈ డంపింగ్ యార్డ్ రెండు నెలల నుంచి విపరీతమైన వాసన వస్తోంది. కొవిడ్ ఉన్నా కూడా మేము బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నామంటే మా బాధను మీరు అర్థం చేసుకోండి. పిల్లలకు వాంతులు అవుతున్నాయి. పెద్దవాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గాలి మొత్తం కాలుష్యమై పోయింది.
ప్ర. ఇన్ని రోజుల నుంచి అధికారులకు ఫిర్యాదు చేశారా? వాళ్లు స్పందించారా?
జ.వాళ్లకి చాలా సార్లు ఫిర్యాదు చేశాం కానీ... వారు పట్టించుకోవట్లేదు. గాలి మొత్తం కాలుష్యమైపోయింది. సరిగా తిండి కూడా తినలేకపోతున్నాం. పడుకుంటే హఠాత్తుగా మెలకువ వచ్చి వాంతులు అయిపోతున్నాయి. నీళ్లు కూడా తాగలేకపోతున్నాం. యాభై లక్షలు పెట్టి ఇళ్లు కొన్నాం. ఇళ్లు ఖాళీ చేసి పోలేం కదా. డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు 2 కి.మీ దూరంలో ఏమి ఉండకూడదని తెలియదా? లే అవుట్‌కి ఎలా పర్మిషన్ ఇచ్చారు. అప్పుడే అప్రమత్తం చేసి ఉంటే... మేము కూడా ఆలోచించుకునే వాళ్లం కదా...