తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 9:39 PM IST

ETV Bharat / state

బాధ్యతారాహిత్యంతోనే కొత్త సచివాలయ నిర్మాణం: తమ్మినేని

కరోనా విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఓవైపు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే... ఉన్న భవనాన్ని కూల్చేసి, కొత్త భవనం కట్టడమేంటని ప్రశ్నించారు.

కొవిడ్​తో ప్రజలు అల్లాడుతుంటే రూ.వందల కోట్లతో భవనాలేంటి ?
కొవిడ్​తో ప్రజలు అల్లాడుతుంటే రూ.వందల కోట్లతో భవనాలేంటి ?

కొవిడ్​తో రాష్ట్రమంతా అతలాకుతలం అవుతుంటే రూ.వందల కోట్ల విలువైన సచివాలయాన్ని తెరాస సర్కార్ కూల్చి వేయడాన్ని సీపీఎం తప్పుబట్టింది. కరోనా కాలంలో వనరులను వైరస్ నియంత్రణకు, ప్రజా సంక్షేమానికి వినియోగించకుండా రూ.వేల కోట్లతో కొత్త భవనాన్ని కట్టాలనుకోవడం అత్యంత బాధ్యతారహితమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలి..

ప్రజా సంక్షేమాన్ని పాతరపెట్టి ఇష్టానుసారంగా.. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా, మూఢ నమ్మకాలతో సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. సచివాలయాన్ని కూల్చడం.. వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేయడం మానుకుని కొవిడ్ సహాయక చర్యలకు సచివాలయాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు.

కొవిడ్​తో ప్రజలు అల్లాడుతుంటే రూ.వందల కోట్లతో భవనాలేంటి ?

ఇవీ చూడండి : రైతుపై బ్యాంక్ సిబ్బంది దాడి.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details